
హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామ ప్రజల ప్రాణాలకు రక్షణ కరువైందని రేపు వరంగల్ జిల్లా కు మంత్రి కేటీఆర్ వస్తున్నందున నేడు (16-06-2023) మడికొండలో మరియు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ సభ్యులు,రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ బక్క జడ్సన్ మడికొండ డంప్ యార్డ్ చెత్తతో తోరణాలు కట్టి కేటీఆర్ కు నిరసన తెలియజేశారు.
మడికొండ డంప్ యార్డ్ సమస్య వెంటనే పరిష్కారించాలని మడికొండ డంపు యార్డ్ వల్ల ప్రజలకు క్యాన్సర్ వ్యాధి మరియు ప్రాణాంతక శ్వాస కోశ వ్యాధులు, చర్మ వ్యాధులు వస్తూ ప్రాణ నష్టాలు జరుగుతున్న ప్రభుత్వం, మున్సిపల్ మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని బక్క జడ్సన్ ఆరోపించారు.
బయో మైనింగ్ ఏమైందని, డంపు యార్డ్ మంటలను ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బంది స్పృహ కోల్పోయి పడిపోవడం చూస్తే ఏ విధంగా మడికొండ కాజీపేట పట్టణం చుట్టుపక్కల గ్రామాలు ఎంత డేంజర్ జోన్ లో ఉన్నారు అర్థమవుతుందని బక్క జడ్సన్ అన్నారు.
వరంగల్ త్రినగరం ను స్మార్ట్ సిటీ, క్లీన్ సిటీ, డ్రీం సిటీ చేస్తా అన్న కేటీర్ GWMC వరంగల్ ను పొల్యూషన్ సిటీ, స్మోక్ సిటీగా మార్చా డని KTR ఏం మొఖం పెట్టుకొని వరంగల్ కు వస్తున్నారని బక్క జడ్సన్ అన్నారు.
వరంగల్ నగర కార్పొరేషన్ పరిధిలోని మడికొండ లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల కాజీపేట మండలం మడికొండ చుట్టుపక్కల గ్రామాలతో పాటు ట్రైసిటీస్ లో భాగమైన కాజీపేట పట్టణం పూర్తిగా అనారోగ్యానికి గురవుతున్నదని ఎఐసిసి సభ్యులు, రాష్ట్ర మాజీ చైర్మన్ బక్కా జడ్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.
హనుమకొండ జిల్లా మడికొండలో 2013లో వరంగల్ నగరంలోని చెత్తను మడికొండలో వేసేందుకు సుమారు 33 ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డ్ ను వరంగల్ నగర కార్పొరేషన్ వారు ఏర్పాటు చేశారు. నగరంలోని అన్ని డివిజన్లలో సేకరించిన చెత్తను ఈ డంపింగ్ యార్డ్ లోనే వేసి నిర్వీర్యం చేసే ప్రక్రియలో భాగంగా గుట్టలుగా పేర్కపోయిన చెత్తను నాటి నుండి నేటి వరకు నిర్లక్ష్య వైఖరితో సంబంధిత మున్సిపల్ శాఖ మరియు జిల్లా అధికార యంత్రంగా నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమే నాటి నుండి నేటి వరకు సమస్య పూర్తి పరిష్కారానికి నోచుకోలేదని బక్క జడ్సన్ అన్నారు.
మడికొండ ప్రజలు నిరంతరం ఈ డంపింగ్ యార్డ్ వల్ల అన్ని గ్రామాల కంటే ముందుగా అనారోగ్యానికి గురవుతున్నారని చుట్టుపక్కల గ్రామాలైనటువంటి ధర్మసాగర్ ఎల్కుర్తి, పెద్ద పెండ్యాల, తరాలపల్లి, టేకులగూడెం, బట్టుపల్లి, రామ్ పేట, అయోధ్య పురం, కుమ్మరిగూడెం, కాజీపేట పట్టణం, ఫాతిమా నగర్, దర్గా తదితర ప్రాంతాలంతా రాత్రి 11 తరువాత పూర్తిగా పొగ మంచుతో కమ్ముకపోయి శ్వాస తీసుకోవడానికి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బక్క జడ్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.
వరంగల్ నగరానికి 2015 లో సీఎం కేసీఆర్ వచ్చిన సందర్భంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు మరియు కాజీపేట పట్టణ ప్రజలు వారి దృష్టికి తీసుకెళ్లగా శాశ్వత పరిష్కారం చేస్తానని నాడు సీఎం కేసీఆర్, ఆ తర్వాత మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన కూడా సమస్యగానే ఉండడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని 2020 లో సుమారు 36 కోట్ల వ్యయంతో బయో మైనింగ్ ఏర్పాటు చేసి పూర్తిగా సమస్య పరిష్కారం చేస్తామని ప్రక్రియను మొదలుపెట్టారని నేటి వరకు ప్రజల ప్రాణాలకు రక్షణ లేదని బక్క జడ్సన్ అన్నారు. 2019 లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యటించి పర్యావరణ రహిత గ్రామపంచాయతీలుగా వరంగల్ నగరంలోని కాజీపేట పరిసర తదితర ప్రాంతాల ప్రజలకు శాశ్వత పరిష్కారం చేస్తారని మడికొండ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆశించారని అదేవిధంగా నాడు పైలెట్ ప్రాజెక్టులో చేర్చి నా కూడా ఫలితం శూన్యమై అయిందని జడ్సన్ అన్నారు.
మడికొండ డంపింగ్ యార్డ్ సమస్యను వెంటనే శాశ్వత పరిష్కారం చేయాలని డంపింగ్ యార్డ్ వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మ వ్యాధులు వస్తున్నాయని ప్రజల ప్రాణాలను రక్షించలేని ప్రభుత్వం మరియు అధికార యంత్రాంగం నగర కార్పొరేషన్ ఎందుకని బక్క జడ్సన్ ప్రశ్నించారు.
మడికొండ డంపింగ్ యార్డ్ తో బాధపడుతున్న ప్రజలందరి ప్రాణాలకు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మరియు మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ బాధ్యులు అని జడ్సన్ అన్నారు.
మడికొండ ప్రజల ప్రాణాల రక్షణ కోసం అంచలంచలుగా ప్రణాళిక బద్ధంగా స్థానిక ప్రజలతో పాటు, చుట్టుపక్కల గ్రామాలు, కాజీపేట నగర ప్రజలందరినీ కలుపుకొని న్యాయపోరాటం చేస్తానని పార్టీలకు అతీతంగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని బక్క జడ్సన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ నాయకులు మహమ్మద్ అంకుస్, బొడ్డు అనిల్, తుల రవి,ఎల్లా గౌడ్, చల్ల తిరుపతి స్వచ్చంద సంస్థ నాయకులు కొలిపాక ప్రకాష్, గ్యాధల సుదర్శన్, వక్కల కుమార్ తదితరులు పాల్గొన్నారు.