ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్.
DYFI వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో రెడ్ బుక్ డే సందర్భంగా భారత విప్లవ కెరటం భగత్ సింగ్ సామూహిక అధ్యయనం చేయడం జరిగింది….
భగత్ సింగ్ జీవిత చరిత్రపై మార్చు 10న వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ డివైఎఫ్ఐ వన్ టౌన్ కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్.
ఖమ్మం మార్చి ఒకటి 20 23 భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రెడ్ బుక్ డే సందర్భంగా భారత విప్లవ కెరటం భగత్ సింగ్ అనే పుస్తకాన్ని స్థానిక సుందరయ్య భవనంలో సాంఘిక అధ్యయనం చేయడం జరిగింది.ఈ సామూహిక అధ్యయనానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాలను ముందుకు తీసుకుపోవటం అంటే ఈనాటి మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడమేనని ఆయన అన్నారు భగత్ సింగ్ ఆరోజు స్వతంత్ర పోరాటంలో పాల్గొంటూ మతం మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆయన అనేక పుస్తకాలు రాశారని నేను ఎలా నాస్తికుడిగా అయ్యాను అనే పుస్తకంలో ఆయన మతం పట్ల ఆయన వైఖరిని స్పష్టంగా తెలియజేశారని అన్నారు నేటి యువత విద్యార్థులు అందరూ కూడా భగత్ సింగ్ జీవిత చరిత్ర కచ్చితంగా చదవాలని ఆనాటి స్వతంత్ర ఉద్యమ పోరాటాన్ని మరొకసారి గుర్తుంచుకోని నాటి మతోన్మాదంపై పోరాటం చేయాలని ఆయన సందర్భంగా యువతకు విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా వన్ టౌన్ కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చి 10న డివైఎఫ్ఐ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జీవిత చరిత్ర పైన సెమినార్ పెడతాము. అని తెలియజేశారు ఈ సెమినార్కు విద్యార్థులు యువత పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సామూహిక అధ్యయనం కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి చింతల్ రమేష్ ,ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎండి గౌస్ ,డివైఎఫ్ఐ వన్ టౌన్ అధ్యక్షులు రావులపాటి నాగరాజు,శభాష్ రెడ్డి, జూపల్లి విష్ణువర్ధన్ పరిగ లక్ష్మణ్, సుగ్గల గోపి,నవీన్,పవన్ ప్రవీణ్,వర్షిత్,తదితరులు పాల్గొన్నారు.