ఈ69న్యూస్ వరంగల్:-మత విద్వేషాలను రెచ్చగొడుతున్న మతోన్మాదులను యువతరం పూలే-అంబేద్కర్ స్పూర్తితో ఎదుర్కొని రాజ్యాంగ రక్షణ ఉద్యమాలు చేపట్టాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు.శంబునిపేటలో జరిగిన పూలే అంబేద్కర్ జన జాతర సభలో ఆయన ప్రసంగిస్తూ,నేడు రాజ్యాంగ విలువలు మత రాజకీయాల వల్ల ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం,ప్రైవేటీకరణ పాలసీల వల్ల సామాజిక న్యాయం నశించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఈ సభలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని పూలే అంబేద్కర్ ఆదర్శాలను స్మరించుకున్నారు.