
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామంలో అహ్మదీయ ముస్లింలు పవిత్ర రమజాన్ మాసమును పురస్కరించుకుని ఉపవాసములు పాటిస్తున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన దిడ్డి రాజహంస కుటుంబీకులు,మరియు పొట్లచెర్ల అశోక్ కుటుంబీకులు వారికి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా స్థానిక మౌల్వీ ముహమ్మద్ నూరుద్దీన్ మాట్లాడుతూ..రంజాన్ ఉపవాసములు మత సామరస్యానికి ప్రతీక అన్నారు.రంజాన్ మాసంలో ఉపవాసములు ఉన్నవారికి ఇఫ్తార్ ఇచ్చినట్లైతే ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు తెలిపారన్నారు.అనంతరం వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో రాజహంస,రాజేష్,రాధిక అశోక్,చాంద్ పాషా,నాసిర్,బాషా,మక్తుం అలీ,రసూల్ తదితరులు పాల్గొన్నారు.