మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరం
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై పిట్ట రాజేష్ ఆధ్వర్యంలో రాత్రి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో వాహనాదారులను బ్రీత్ అనలైజర్ పరికరాల సహాయంతో పరీక్షించారు.తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిని గుర్తించి వారి మీద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.అదేవిధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్రవాహన దారులను ఆపి,వారిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై పిట్ట రాజేష్ మాట్లాడుతూ..“మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని,హెల్మెట్ ధరించడం ప్రతి ద్విచక్రవాహనదారుడి ప్రాణభద్రతకు అత్యవసరం అన్నారు.చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని తెలిపారు.డ్రంకన్ డ్రైవ్ లేదా నియమాల ఉల్లంఘనలో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని”సూచించారు.ఈ తనీఖీల్లో ఎస్సై మనీషా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు