మరణం లేని మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి
Suryapetమండల కేంద్రంలోని శనివారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74 వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇంచార్జి పచ్చిపాల వేణు యాదవ్ ఆదేశాల మేరకు కేక్ కట్ చేసి, వైఎస్ఆర్ విగ్రహాన్ని కి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ …అపర భగీరధుడు,రైతు బాంధవుడు, ఆరోగ్యశ్రీ ప్రదాత,పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్తాయిగా నిలచిపోయిన మహానీయుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆయన మరణం లేని మహానేత అని,ఆరోగ్య శ్రీ, 104, 108 సేవలు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం.. ఇలా ఎన్నో పథకాలు అమలుపరిచారని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా ఆయన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో మంది పేదలు ఉచిత గుండె వైద్యం అందేలా చొరవ తీసుకున్న మహా నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. పేద పిల్లలు కూడా ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల తోపాటు, దళిత గిరిజన విద్యార్థులకు సైతం ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలలో ప్రవేశం లభించేలా చర్యలు తీసుకున్నారన్నారు. లక్షలాదిమంది ఇంజనీర్లను, వైద్యులను ఈ సమాజానికి అందించిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి కి దక్కుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన రామారావు, నడిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు ఎస్కే రహిం,నరసింహారెడ్డి, యారగాని లింగయ్య, పబ్బు లింగయ్య, పవన్, దాసరి నాగార్జున ,తదితరులు పాల్గొన్నారు.