
మల్లక్ పల్లి గ్రామంలో మహిళా దినోత్సవం వేడుకలు
ఈ69న్యూస్ ధర్మసాగర్
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్ పల్లి గ్రామంలో బాలవికాస స్వచ్ఛంద సేవ సమస్థ ఆధ్వర్యంలో మహిళలందరితో మానవహారం చేసి స్కూల్ ఆవరణంలో ర్యాలీ తీసి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని తెలుపుతూ మహిళల సాధికారతకై చెప్పడం జరిగింది.మహిళలకు ఆటలు పోటీలు పెట్టి బహుమతులు ఇవ్వడం జరిగింది.అలాగే మహిళలు ఆలోచించి లక్ష్మీనరసింహ హాస్పిటల్ నుండి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది.అలాగే మహిళలను సన్మానించడం జరిగింది.ఇందులో గ్రామ ప్రజలు బాలవికాస అనిత రజిత స్వప్న అనిత తదితరులు పాల్గొన్నారు.