bhadradri kothagudem news
గళం న్యూస్ / దుమ్మగూడెం, సెప్టెంబర్24
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలానికి చెందిన ఆదివాసి సంక్షేమ పరిషత్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు సోందె మల్లు దొర వారి సతీమణి రమణ క్యాన్సర్ వ్యాధితో మరణించారు నిత్యం ఆదివాసి సమస్యలపై ఎంతో చురుకుగా పనిచేసే మల్లు దొర సతీమణి మరణంతో దిగ్బ్రాంతి చెందారు. ఆదివాసి సాంప్రదాయాల ప్రకారం మరణానంతరం మూడవ రోజున అనగా గురువారం నాడు చిన్న కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదివాసి సంక్షేమ పరిషత్ రెండు తెలుగు రాష్ట్రాల గౌరవ సలహాదారులు కొరస వెంకటేశ్వరరావు (కె వి) పాల్గొని మల్లు దొర కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొర్ష వెంకటేశ్వర్లు తోపాటు మాజీ జెడ్పిటిసి తెల్లం సీతమ్మ, ఏఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోయం కామరాజు దుమ్మగూడెం మండల అధ్యక్షులు కుర్సం రవి కొమ్ము రంజిత్ తదితరులు పాల్గొన్నారు.