
మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం కోరుతూ ధర్మ సమాజ్ పార్టీ ర్యాలీ
నల్గొండ జిల్లా బొక్కంతలపాడు గ్రామంలో ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు విషార్ధన్ మహారాజ్ ర్యాలీ నిర్వహించారు.మృత దళిత యువతి మల్లేశ్వరి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.నెల రోజులు గడిచినా ప్రజాప్రతినిధులు పరామర్శించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.న్యాయం జరగకపోతే జిల్లావ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు.పార్టీలోని పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.