
-డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు
గళం డోర్నకల్:-
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని,డోర్నకల్ నియోజకవర్గంలో నేనే ఎమ్మెల్యేగా గెలుస్తానని రెడ్యానాయక్ ప్రజల సమక్షంలో అన్నారు. మరిపెడ మండలంలో శుక్రవారం ఆనేపురం యలమంచిలి తండా, వెంకట్య తండా, గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యేకు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావుకు,గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు గుంట నక్కల ప్రజలను దోచుకో తినడానికే వేచి చూస్తున్నాయన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ నాయకులు గెలిస్తే శాశ్వతంగా తొలగిస్తారు అన్నారు.డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్యానాయక్ ను ఓడించే సత్తా ఏ పార్టీ నాయకులకు లేదన్నారు.ప్రజల కష్టాలను విని తీర్చడానికి 24 గంటలు ఎలాప్పుడు అందుబాటులో ఉంటాన్నానారు.ఎవరు ఎన్ని కుట్రలు,అసత్య ప్రచారాలు చేసిన రెడ్యానాయక్ కు ఒరిగేది ఏమీ లేదన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నీళ్ల కష్టాలను తీర్చిన అపర భగీరథుడు సీఎం కెసిఆర్ అని అన్నాడు..ఈ కార్యక్రమంలో మరిపెడ యంపీపీ గుగులోతు అరుణా రాంబాబు,జెడ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్,మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న,మాజీ ఓడిసిఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి,యలమంచిలి తండా సర్పంచ్ పార్వతి మంగిలాల్,ఆనేపురం సర్పంచ్ దామెర వీరన్న, వెంకట్యా తండ సర్పంచ్ సూర్యనాయక్, స్టేజీ తండా సర్పంచ్ జాటోత్ భీమా నాయక్, గందసిరి కృష్ణ,మరిపెడ తహాసిల్దార్ పిల్లి రాంప్రసాద్, యంపిఓ పూర్ణచందర్ లాల్ సింగ్,ప్రవీణ్ నాయక్,మంద వెంకన్న,హరీష్, భానోత్ భద్రు నాయక్,మురళీ తదితరులు పాల్గొన్నారు.