
టిడిపి ఇంచార్టి చాడ మరియా సురేఖ
ఈ69 న్యూస్ వరంగల్
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా సమాజంలో అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా ముందుండాలని వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజక వర్గం టిడిపి ఇంచార్జి చాడ మరియ సురేఖ పిలుపునిచ్చారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో మహిళల పైన చిన్న పిల్లలపైన,వృద్దుల పైన,జరుగుతున్న లైంగిక దాడులను ఖండించారు.మహిళల రక్షణ కోసం మహిళా ఎమ్మెల్యేలు మంత్రులు,ఎంపిలు అసెంబ్లీ,పార్లమెంట్ లో చర్చించాలని కోరారు.సిఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటిలలో మహిళలకు ఇస్తానన్న పథకాలు పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.