
ఈ69న్యూస్ హన్మకొండ
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.శుక్రవారం హనుమకొండ జిల్లా పరకాలలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పరకాల నియోజకవర్గ పరిధిలోని గీసుకొండ,సంగెం,ఆత్మకూర్,దామెర మండలాలకు సంబంధించి కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మహిళల ఉపాధి,ఆర్థిక అభివృద్ధికి సంబంధించి మాటల వరకే పరిమిత కాకుండా మహిళా సాధికారత విషయంలో నేనున్నా అంటూ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అండగా ఉంటున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు అందరూ కూడా ఓరుగల్లు పట్టణానికి సంబంధించి అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం మంచి పాలసీ విధానాలతో ప్రజలకు ఉపయోగపడే ప్రగతిశీల కార్యక్రమాలను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.ప్రభుత్వము వచ్చిన తర్వాత 57వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసేనని అన్నారు.మహిళలు తమ సొంత కాళ్లపై నిలబడేలా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.రాబోయే కాలంలో స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మహిళలను ఆర్థికాభివృద్ధిలో నడిపించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని,డెయిరీ పరిశ్రమ ఏర్పాటుచేసి పాల ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తామన్నారు.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి,వర్ధన్నపేట ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు,కె ఆర్ నాగరాజు,వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి,కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి,హనుమకొండ వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య,సత్య శారద,ఆర్డిఓ లు మేన శ్రీను,కౌసల్యా దేవి,పరకాల ఆర్డిఓ నారాయణ,ఇతర అధికారులు పాల్గొన్నారు.