
హనుమకొండ: మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ పిలుపునిచ్చారు.
సోమవారం హనుమకొండ రాంనగర్ సుందరయ్య భవన్లో డివైఎఫ్ఐ యంగ్ ఉమెన్స్ కన్వెన్షన్ జరిగింది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడారు. దేశంలో ప్రతిరోజు ఏదో ఒకచోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయని వాటిని అరికట్టడంలో పాలకులు విఫలమయ్యాయి, మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు చేసినప్పటికీ దాడులు పెరిగిపోతూనే ఉన్నాయని, మహిళలను కించపరిచే విధంగా కార్పొరేట్ వ్యాపార సంస్థలు వ్యవహరిస్తున్నాయి, మహిళల కోసం ఏర్పాటు చేసిన చట్టాలను పగడ్బందీగా అమలు చేసి రక్షణ కల్పించాలని, సమాజంలో సగభాగం అయినప్పుడు విద్యా ఉపాధి రంగంలో సమచిత స్థానం కల్పించాలని, అసమానత లేని సమాజ నిర్మాణం కోసం జరిగే పోరాటంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నోముల కిషోర్, దోగ్గేల తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు మంద సుచందర్, జిల్లా సహాయ కార్యదర్శిలు ఓర్సు చిరంజీవి చిట్యాల విజయకుమార్ లు పాల్గొన్నారు.
డివైఎఫ్ఐ జిల్లా యంగ్ ఉమెన్స్ కమిటీ ఎన్నిక
జిల్లా కన్వీనర్ గా కత్తి గీత, కో కన్వీనర్ గా ఎన్ మౌనిక, సంధ్య, గాయాల అనుష, శ్రీలత భాగ్యలక్ష్మి, సభ్యులుగా మాధవి, రాధిక, అనిత, కర్ణ సుష్మ భాను శ్రావణి సుష్మిత లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ తెలిపారు.