మహిళా హక్కుల కోసం పోరాడాలి-మల్లు లక్ష్మి
Jangaonఅఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జనగామ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతులు పట్టణంలోని పూసల భవనంలో జరిగాయి .ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా ఈర్రి అహల్య వ్యవహరించారు. ఈ సందర్భంగా ఈ క్లాసులకు ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ బిజెపి మోడీ ప్రభుత్వ పాలనలో మహిళలకి రక్షణ లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తూ మనుధర్మ శాస్త్రాన్ని చతుర్బరణ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నిస్తుందన్నారు.మహిళలు అనగానే అనిగిమనిగి ఉండాలి తప్ప ప్రశ్నించకూడదు ఆడవాళ్ళ దుస్తుల వల్లనే మహిళలపై అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయని బిజెపి మంత్రులే మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. బాధితురాలు పట్ల అండగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం మంత్రులు దోషులకు అండగా ఉంటూ దోషుల్ని దండలు వేసి సన్మానించడం తల్లి పక్కలో ఉన్న పసిపిల్లను బడికి పోయేటువంటి అమ్మాయిల్ని ఎత్తుకు వెళ్లి అమ్మాయిలపై వృద్ధ మహిళ పై హత్యాచారాలు జరుగుతున్నాయని దీనికి ఏమి సమాధానం చెప్తారన్నారు. ఈ మధ్యకాలంలో బిజెపి మను ధర్మ శాస్త్ర భావజాలాన్ని కలిగిన ప్రవచనాలు చెప్పే పంచాంగ కర్తలు గరికపాటి నరసింహారావు మహిళల అవయవాల గూర్చి మాట్లాడడం యోగ పేరుతో మోసం చేస్తూ కోట్ల రూపాయలు ఆదాయాన్ని సంపాదించిన సన్యాసి అయినా రాందేవ్ బాబా మహిళలు బట్టలు లేకుండా ఉంటే అందంగా ఉంటారని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. నరేంద్ర మోడీ అధికరణకు వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని నిరుద్యోగం దారిద్రం పెరిగిందన్నారు. రాబోవు కాలంలో మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా హత్యలకు అత్యాచారాలు వ్యతిరేకంగా మహిళలోకం ఐక్యమై ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బత్తుల హైమావతి గారు రెండో పూట క్లాసు మహిళల పట్ల వివిధ రాజకీయ పార్టీల వైఖరి అనే అంశంపై క్లాస్ బోధించారు. ఈ కార్యక్రమంలో ఎండి షబానా పందిళ్ళ కళ్యాణి పొన్నాల ఉమా కొండ వరలక్ష్మి బూడిద అంజమ్మ చీర రజిత రాములమ్మ బి కరుణ ఎండి గౌసియా సిహెచ్ శ్రీలత యు సంతోషిని జి శశిరేఖ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు