ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మరియు అడ్మినిస్ట్రేషన్ అధికారి రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు వినతి పత్రం అందజేశారు.తాజాగా ఈనెల 10న చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని,అలాగే 23న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ,ఆయుష్ హాస్పిటల్ మరియు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో తన దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తూ ఈ వినతిని చేశారు.ఈ సందర్భంగా భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి తదితరులు గండ్ర వెంకట రమణా రెడ్డి గారితో కలిసి ఉన్నారు.