
మాజీ వార్డ్ కౌన్సిలర్ వాంకుడోత్ అనితకు బంజారా జాతి నాయకుల పరామర్శ
ఈ69న్యూస్ జనగామ
జనగామ రెండవ వార్డుకు మాజీ కౌన్సిలర్‌గా పని చేసిన వాంకుడోత్ అనిత బీకోజీ నాయక్ కుటుంబంలో విషాదం నెలకొంది.ఆమె తల్లి గుగులోతు లక్ష్మీ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతిచెందింది.భౌతికకాయాన్ని స్వగ్రామమైన మైలారం తండాకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.ఈ సందర్భంలో జనగామ జిల్లా లంబాడి-బంజారా జాతికి చెందిన నాయకులు పరామర్శకు వచ్చి వాంకుడోత్ అనిత కుటుంబాన్ని ఓదార్చారు.కుటుంబానికి ధైర్యం,మానసిక స్థైర్యం కల్పిస్తూ జాతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు.ఈ పరామర్శలో మూడ్ లక్ష్మణ్ నాయక్,గూగులోత్ లచ్చయ్య నాయక్,ధరావత్ సోమ్ల నాయక్,భూక్యా వాసు నాయక్,బానోత్ హరిలాల్ నాయక్,ధారావత్ నాగేందర్ నాయక్,అజ్మీర స్వామి నాయక్,లకావత్ నరేష్ నాయక్,భూక్యా చందు నాయక్,గుగులోత్ భాస్కర్ నాయక్,ధరావత్ కీమా నాయక్,వెంకటేశ్వర్లు నాయక్,లకావత్ లాల్మా నాయక్,ధారావత్ కీమ్ల నాయక్,భానోత్ వెంకన్న నాయక్,కోట నాయక్,నరసింహ తదితరులు పాల్గొన్నారు.