మాదిగల విశ్వరూప మహాసభ విజయవంతం చేయండి
Khammamఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం హైదరాబాదులో జరిగే మాదిగల విశ్వరూప మహాసభ విజయవంతం కోసం ఈనెల 24న ఇల్లందు పట్టణంలో జరిగే ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా మహాసభను విజయవంతం ఉన్ చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి ఏపూరి వెంకటేశ్వర మాదిగ పిలుపునిచ్చారు.. ఈరోజు పాల్వంచ లో జరిగిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల సమావేశానికి హాజరై ప్రసంగిస్తూ. 29 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ ఉద్యమం వర్గీకరణ సాధించుకోవడానికి నిరంతరం పోరాటం చేస్తుందని. సామాజిక న్యాయ పోరాటానికి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వర్గీకరణ సమర్థిస్తున్న రాజకీయ పార్టీల సిద్ధ శుద్ధి కొరవటం వలన సమస్య పరిష్కారానికి నోచుకోవటం లేదని. రాజకీయ పార్టీల నిజస్వరూపాన్ని బయటపెట్టి పాలక ప్రతిపక్ష పార్టీల కు మాదిగల విశ్వరూపాన్ని హైదరాబాదులో చూయించి వర్గీకరణ సాధించుకోవటానికి జరిగే విశ్వరూపం మహాసభ విజయవంతం కోసం ప్రతి ఒక్కరు హైదరాబాదు నగరాన్ని చేరుకొని మాదిగల ఐక్యతను ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి సాటి వర్గీకరణ సాధించుకోవడానికి లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మహాసభ విజయవంతం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా సదస్సు ఇల్లందు పట్టణంలో ఐతా ఫంక్షన్ హాల్ నందు ఈనెల 24 మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని. ఈ సభకు ముఖ్యఅతిథిగామందకృష్ణ మాదిగ హాజరవుతారని కావున ఎమ్మార్పీఎస్. ఎంఎస్పి. మరియు అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కొత్తపల్లి సోమయ్య మాదిగ. మిరియాల వెంకటేశ్వర్లు మాదిగ. మహిళా నాయకురాలు గుర్రం నాగమణి మాదిగ. దగ్గుపాటి సువార్త. వంగూరు రామ్మూర్తి. కత్తి శ్రీనివాసరావు. గంగపురి శ్రీనివాసరావు. రామకృష్ణ. రామారావు. నాగరాజు. కృష్ణ. ప్రవీణ్. వంశీ. రాంబాబు పుల్లారావు అప్పారావు మోహన్ రావు వెంకన్న ఇస్తారి రమణయ్య రాజబాబు రామారావు పెద్దలు పాల్గొన్నారు.