మృతదేహాన్ని అడవిలో మరియు వాగుల వెంట దాదాపు నాలుగు కిలోమీటర్లు మోసిన పోలీసులు . మేడారం సమ్మక్క సారక్క జాతర ఆదివారం రోజున రద్దీ ఉన్నప్పటికీ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు అడవి ప్రాంతంలోని 4 కిలోమీటర్ల లోపల ఉన్న ఈ మాటేరుతోగు వద్ద వ్యక్తి నీటిలో మనిగిపోయాడన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న తాడ్వాయి ఎస్ఐ ననిగంటి శ్రీకాంత్ రెడ్డి మరియు సిబ్బంది సాంబయ్య, పూజారి రమేష్, ఆర్మీ రమేశ్, కిషోర్ రిషిలతో పాటుగా సిసియస్ ములుగు ఇన్స్పెక్టర్ అనుముల శ్రీనివాస్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ములుగు సట్ల కిరణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని నీటిలో నుండి శవాన్ని బయటకు తీసి మృతదేహాన్ని సంఘటన స్థలం నుండి చిలకలగుట్ట వరకు దాదాపు నాలుగు కిలోమీటర్ల వరకు భుజాలపై మోసుకొని వచ్చి పోస్టుమార్టం కోసం వాహనం ఏర్పాటు చేసి ములుగు ఆసుపత్రికి తరలించడం జరిగింది.