మానవ ప్రగతికి వైజ్ఞానిక దృక్పథం మూలం
Hyderabadమానవ ప్రగతికి వైజ్ఞానిక దృక్పథం మూలమని విజ్ఞాన దర్శిని అధ్యక్షులు రమేష్ గారు అన్నారు. శనివారం రోజున స్థానిక గాయత్రి గార్డెన్లో సిపిఎం జిల్లాస్థాయి శిక్షణ తరగతులు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ శిక్షణ తరగతులకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సాంబరాజు యాదగిరి ప్రిన్సిపాల్ గా వ్యవహరించగా ముఖ్యమంత్రిగా హాజరైన విజ్ఞానదర్శిని రాష్ట్ర అధ్యక్షులు రమేష్ గారు శాస్త్రి ఆలోచన క్లాసును ఉదయం పూట బోధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రమ మానవుని పని నుండి పుట్టింది అని వేదాలు పురాణాల మత గ్రంథాల నుండి కాదన్నారు. ప్రతి కుల వృత్తిలో వైజ్ఞానిక ఆలోచనలు ఇమిడి ఉన్నాయన్నారు. ఆదిమానవుని నుండి నేటి వరకు ప్రతి అంశం వెనుక సైన్స్ ఉందన్నారు. మానవాళి అభివృద్ధికి సైన్సు పరిశోధనలు అవసరమని మనిషి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరించే శక్తి మనిషికే ఉందన్నారు. సామాజిక అంశాల విశ్లేషణ అధ్యయనాలను శాస్త్రీయ హేతువాద దృక్పథంతో చేసే ఆలోచనలే అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పురాతన చాందసవాద భావాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నాయన్నారు. మానవాళి అభివృద్ధి కోసం పనికొచ్చే సైన్సును ప్రజలందరూ ఉపయోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు. సైన్సు ప్రాతిపదికగా శాస్త్రీయ దృక్పథంతో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మధ్య చిచ్చులు పెడుతూ ప్రజలను పోరాటాల్లోకి రాకుండా దృష్టిని మరల్చడానికి భావోద్వేగ సమస్యలను మతాల జాతుల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. వివిధ మతాలు, జాతుల సమూహాలలో ఉన్న ప్రత్యేక హోదా స్మూతులలో ఉన్న అసమానతలను ఆ సమూహాలను చైతన్యం చేయడం ద్వారా తొలగించాలని గాని బలవంతంగా ఉండే ప్రయత్నం బిజెపి మానుకోవాలని వారు హితవు పలికారు. ప్రయత్నం చేస్తుందన్నారు. మధ్యాహ్నం క్లాసును పార్టీ కార్యక్రమం దాని విశిష్టత అంశంపై సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పీ సోమయ్య గారు బోధించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూకు కనకా రెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు ఇర్రి అహల్య సింగారపు రమేష్ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి జోగు ప్రకాష్ సుంచు విజేందర్ పుతుకూరు ఉపేందర్ బెల్లంకొండ వెంకటేష్ పొదల నాగరాజ్ కోడెపాక యాకయ్య మునగాల రమేష్ గంగాపురం మహేందర్ దేవదానం కళ్యాణం లింగం బొట్ల శ్రావణ్ దూసరి నాగరాజు చీర రజిత పొన్నాల ఉమా తదితరులు పాల్గొన్నారు.