
bhadrachalam news
మలేరియా రాకుండా తగు జాగ్రతలు తీసుకోవాలి – డాక్టర్ స్పందన
(మలేరియా -NCVBDC), మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖధికారి గారి ఆదేశాల మేరకు జిల్లాలోని పర్యవేక్షకుల హెల్త్ అసిస్టెంట్ మగ కార్యకర్తలకు మరియు రక్త పరీక్ష చెయ్యు ల్యాబ్ టెక్నీషియన్ అందరికి నెల వారి సమీక్షా మరియు ఇంటిగ్రాడెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాటుఫారం గురించి సమగ్ర శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని మలేరియా అధికారిని స్పందన అన్నారు.. I
ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ
.2024 జనవరి నుండి తప్పకుండ వైద్య ఆరోగ్య శాఖ తరుపున మారుమూల గ్రామాలలో అందిస్తున్న ముఖ్యమైన మలేరియా నిర్ములన కార్యక్రమం సక్రమంగా నిర్వహించడమే కాకుండా IHIP portal లో online చెయ్యాలని, ఒక్క మలేరియా మరణం కూడా జరగకుండా అందరు మారుమూల గ్రామాలలో మంచి సేవలు అందించాలని చెప్పడం జరిగినది.మలేరియా నిర్ములన మరియు సహాయ మలేరియా అధికారి మాట్లాడుతూ 2024 నూతన సంత్సరము లో ఉత్సాహంగా అందరం పనిచేసి మారుమూల గ్రామాలలో వైద్యసేవలు అందించాలని దిశనిర్దేశం చెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మలేరియా అధికారి డాక్టర్ స్పందన, జిల్లా సహాయ మలేరియా అధికారి గొంది వెంకటేశ్వర్లు, SUOs వెంకటేశ్వర్లు, లింగ్యా నాయక్, కుమార్, IDSP నుండి హరికిషన్, రంజిత్, LTs ఎబినైజర్, లాలూలాల్, గోపి తదితరులు పాల్గొన్నారు.