మార్చి 20 న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ ఠానూ నాయక్
Hyderabadమార్చి 20 న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ ఠానూ నాయక్ 76వ వర్థంతి సభలను జయప్రదం చేయండి.
-తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు.
- గోడ పత్రికలు, కరపత్రాలను విడుదల చేసిన గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు
సోమవారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన గోడపత్రికలు, కరపత్రాల విడుదల కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం ధర్మ నాయక్ ఆర్ శ్రీరాం నాయక్, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర నాయకులు జి రాములు, భూపతి వెంకటేశ్వర్లు, గిరిజన సంఘం హైదరాబాద్ నగర నాయకులు ఆంగోత్ కృష్ణా నాయక్, ఎం గోపి నాయక్, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, వీరత్వానికే నిలువెత్తు రూపమైన కామ్రేడ్ జాటోత్ ఠానూ నాయక్ 76 వ వర్ధంతి సభలను మార్చి 20వ తేదీన తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తండాలల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్ధంతి సభల్లో గిరిజనులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.జనగాం తాలూకాలో విసునూరు రామచంద్రారెడ్డి, వుసుకూరు రాఘవరావు, కడారి నరసింహారావు, బాబూదొర అనే భూస్వాములైన దొరలు నిరంకుశ నిజాం ప్రభుత్వ పోలీసుల అండతో అమాయక ప్రజలు,గిరిజనుల భూములను ఆక్రమించడం, నిర్ధాక్షిణ్యంగా పన్నులు వసూలు చేయడం, ఎదురు తిరిగిన వారిని చంపడం, చిత్రహింసలు పెట్టడం, మహిళలపై అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలు, నిత్యకృత్యంగా సాగేవని తెలిపారు.దేవరుప్పల మండలం ధర్మాపురం లంబాడీ గిరిజనులకు చెందిన 80 ఎకరాల మెట్ట, 25 ఎకరాల మాగాణి భూములను ఆక్రమించారు.ఇది తెలుసుకున్న తండా పెద్దలైన జాటోత్ హాము, జాటోత్ రామోజీ కుటుంబాల కొడుకులు, లంబాడీలు వడిసెలు, గుదపలుతో వారితో తలపడ్డారు. లంబాడీల పోరాట పఠిమ ముందు నిలబడలేక పారిపోయారన్నారు. తండాలో లంబాడీలు సాగుచేసుకుంటున్న 30 ఎకరాల మాగాణి, 40 ఎకరాల బంజరు భూమిని కదారి నరసింహారావు వారి భూములను తన పేర రాయించుకోవడంతో కోపోద్రిక్తులైన లంబాడీ గిరిజనులు చుట్టుపక్కల గ్రామాలు, తండాల ప్రజలను ఏకంచేసి 3 వేల మంది ప్రజలు,గిరిజనులతో తలపడటానికి సిద్ధమయ్యారు. జాటోత్ హాము కొడుకులైన ఆరుగురు జోద్యా నాయక్, సోమ్లా నాయక్, సంకు నాయక్, ఠానూ నాయక్, దర్యా నాయక్, చివరి వాడు కిషన్
కామ్రేడ్ ఠానూ నాయక్ ను సజీవంగా పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఏడాదిపాటు సైన్యానికి, శత్రువులకు దొరకలేదు. చివరకు ఒక ద్రోహి యిచ్చిన సమాచారం వల్ల ముండ్రాయి గ్రామంలో సైన్యం, దొరల చేతికి చిక్కారు. అతడిని పెట్టని హింసలేదు. ఎన్ని బాధలు పెట్టినా పార్టీ రహస్యం ఒక్కటికూడా బయట పెట్టలేదు. అతని మొండితనం, ధైర్యం, తెగువను సైన్యాధికారులకు కూడా ఆశ్చర్యం అనిపించింది. వారు ఠానూ నాయక్ ను చంపడానికి నిరాకరించారని అన్నారు. అప్పుడు అక్కడే కాచుకుని కూర్చున్న రామవరం దేశముఖ్ కటారు నర్సింగరావు ఠానూ నాయక్ ను బండి చక్రానికి కట్టించి శరీరం ముక్కలై పోయేవరకు ఈడ్పించి చంపాడని ఆవేదన వ్యక్తం చేశారు. 1950 మార్చి 20వ తేదీన ముండ్రాయి గ్రామంలో కామ్రేడ్ జాటోత్ ఠానూ నాయక్ వీరమరణం పొందారని తెలిపారు. తుది ఘడియలో సైతం ఆయన పెదవులపై “కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి- శత్రువు అంతం చూడాలి” అన్ని నినాదాలే నాట్యమాడాయని ఆనాడు పోరాటంలో పాల్గొన్న మహనీయులు రాసిన నిజమైన చరిత్ర అని అన్నారు. అటువంటి మహోన్నతమైన పోరాట చరిత్రను బిజెపి,ఆర్ఎస్ఎస్ వంటి మతోన్మాద శక్తులు చరిత్రను మతాల మధ్య జరిగిన పోరాటంగా వక్రీకరించి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానాలు, సినిమాల రూపంలో ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.