గళం న్యూస్ భద్రాద్రి జిల్లా *
…*ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చోటే కెడ్వాల్ అడవిలో మావోయిస్టులు దాచిన డంప్‌ను బుధవారం భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గాలింపు చేపట్టన బలగాలను గమనించిన మావోయిస్టులు పారిపోయారు. ఘటనా స్థలం వద్ద ఆయుధాలు, పేలుడు పదార్థాలు, పైపు బాంబులు, తుపాకులు లభ్యమయ్యాయి. వాటిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.