
ఈ69న్యూస్ జఫర్ఘడ్ ఫిబ్రవరి 01
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన కుక్కల చంద్రయ్య కొడుకు యాకయ్య ఇటీవల వరంగల్ జిల్లా వరదన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.ఈ సందర్భంగా జడ్పిఎస్ఎస్ తమ్మడపల్లి జి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న యాకయ్య కుమారుడైన హరీష్ క్లాస్ మెంట్ మిత్రులు 25కిలోల బియ్యం అందజేసి తమ ఉదారతను చాటి నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు.గ్రామస్థులు వారి ఉదారతకు మెచ్చుకొని ప్రశంసలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రవణ్,రాజేష్,రమణ,వరుణ్ తేజ్,రుద్విక్,రామ్ చరణ్,జశ్వంత్,శివ,రామ్ చరణ్,రేవంత్,ఆదిత్య తదితర విద్యార్థులు పాల్గొన్నారు.