
ఈ69న్యూస్ హన్మకొండ
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన శాంతాల మల్లేశం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు.2003లో ఐనవోలు ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో కలిసి చదువుకున్న క్లాస్మేట్స్ మల్లేశం మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.ఆయన కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడాలని ముందుకొచ్చి రూ.30,000 సాయం అందించారు. మల్లేశం కుటుంబాన్ని ఓదార్చిన ఈ చర్య గ్రామస్థుల ప్రశంసలు అందుకుంది.