గళం న్యూస్ భద్రాద్రి జిల్లా *
అశ్వారావుపేట మండల కేంద్రంలో జంగారెడ్డిగూడెం రోడ్డులో గల సాయిబాబా ఆలయం పక్కన ప్రభుత్వ ఖాళీ స్థలంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇండోర్ మినీ స్టేడియం నూతన నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పనులను ప్రారంభించారు. అలాగే మండలంలోని అన్ని పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులతో కలసి తెలుగు భాషా దినోత్సవం మరియు హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించి విద్యార్థులతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు