
telugu galam news e69news local news daily news today news
నలుగురికి తీవ్ర గాయాలు, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు గళం న్యూస్ :నడిగూడెం 23(నడిగూడెం) మిరప కూలిల ఆటో బోల్తా పడి పలువురుకి గాయలైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. నడిగూడెం మండల కేంద్రానికి చెందిన 15 మంది కూలీలు సూర్యాపేట జిల్లా మోతె, మండలంలోని హుసేన్ బాద్ గ్రామం లో మిరప తోట లో పని ముగించుకొని తిరిగి వస్తుండగా మోతె,నడిగూడెం మండల కేంద్రాల శివారులోని మూలమలుపు వద్ద ఆటో బోల్తా పడటంతో అటో లో ప్రయాణిస్తున్న కూలిలకు గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమం గా ఉన్నట్లు తెలుస్తుంది. మారో కొంతమందికు త్రివ గాయాలు అయినట్లు తెలుస్తుంది, క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జిల్లా ఏరియా హాస్పిటల్ కు తరలించారు.పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ హాస్పిటల్ కు తరలిస్తునట్లు తెలుస్తుంది.