
మీరు వచ్చింది మీకోసమే నేను వచ్చింది మీకోసమే
వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారుల పరకాల నియోజకవర్గ సదస్సులో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2000 పెన్షన్ ను 4000 గా 4000 పెన్షన్ ను 6000 గా చేస్తామని చెప్పినా రేవంత్ రెడ్డి ఈరోజు ఆ మాట మీద ఊసే లేదని అన్నారు. యాభై ఐదు లక్షల పేద కుటుంబాలు పెన్షన్ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారని అన్నారు. ఈరోజు ఈ కాంగ్రేస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేద ప్రజలను మోసం చేశారాని అన్నారు.మీరు వచ్చింది మీకు పెన్షన్ పెరగాలని మీకు కొత్త పెన్షన్ సాంక్షన్ కావాలని నేను వచ్చింది కూడా మీ కోసమేనని అన్నారు.ఇప్పటికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 22 నెలలు గడిచింది కానీ కొత్త పెన్షన్ ఇవ్వలేదు పాత పెన్షన్లు పెంచలేదు 45 లక్షల పాత పెన్షన్లు 10 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని అన్నారు. ఇంత మోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఏ పార్టీ మాట్లాడడం లేదని మందకృష్ణ మాదిగ అన్నారు. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అయితే కనబడుట లేదని అన్నారు. 22 నెలల్లో కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లలేదు పేద ప్రజల గురించి ప్రశ్నించడం లేదు అంటే పెంచాల్సిన పెన్షన్లు రేవంత్ రెడ్డి పెంచడం లేదు కేసీఆర్ అడగడం లేదు అని అన్నారు. పెన్షన్లు పెరిగి కొత్త పెన్షన్లు వచ్చేవరకు నేను మీతో పాటు పోరాటం చేస్తానని అన్నారు. ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎమ్మార్పీఎస్ తరపున నేను ఉద్యమిస్తేనే ఆరోగ్య శ్రీ పథకం తీసుకొచ్చాడని గర్వపడ్డారు. మీ మీ వెంట నేనుంటా ప్రతి మండల కేంద్రంలో జిల్లా కేంద్రంలో దీక్షలు చేయండి ప్రభుత్వం ఎందుకు దిగిరాదో అప్పుడు చూద్దామని మందకృష్ణ మాదిగ ప్రకటించారు.