
ముందస్తు బతుకమ్మ పండుగ వేడుకలు
తెలంగాణ ఆత్మస్పూర్తిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని వాణి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో ఈరోజు ముందస్తుగా ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.
ఈ వేడుక పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ రజిన్ కుమార్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణం లో పూలతో, పాటలతో, కోలాటలతో సందడి చేసారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కోలాటం ఆడుతూ జానపద గీతాలు పాడుతూ బతుకమ్మ చుట్టూ ఆనందంగా ఆడుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు, రవీందర్, రమేష్, తిరుపతి, దేవేందర్, చంద్ర మొగిలి, ఓంకార్, సుమన్, ఐలయ్య, స్వప్న, కరుణశ్రీ, అశ్విని, అసిఫీయా, ఫైమా, ఉజ్వల, రాధిక, శిరోమణి, అభేద మరియు విద్యార్థులు పాల్గొని వేడుకను మరింత వైభవంగా మార్చారు.
ఈ వేడుక విద్యార్థుల్లో తెలంగాణ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని, ఆచారాల పట్ల ఆసక్తిని పెంచింది