
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలి
ఈనెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యాపేట లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా కోదాడ పట్టణం నుండి పదివేల మంది కార్యకర్తలు తరలిరావాలని బిఆర్ఎస్ పార్టీ కోదాడ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు అన్నారు.గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని 35 వార్డుల నుండి కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చే విధంగా జన సమీకరణ ఏ విధంగా చేయాలో నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కోదాడ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికి వారి పర్యటన విజయవంతం చేసేందుకు నాయకులు కృషి చేయాలి అన్నారు.ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పైడిమర్రి సత్తిబాబు వెంపటి మధుసూదన్, షేక్ నయీమ్, గంధం పాండు, బెజవాడ శ్రావణ్, బత్తుల ఉపేందర్, సంపేట.ఉపేందర్ గౌడ్,కనగాల శ్రీధర్, పిట్టల భాగ్యమ్మ,అలవాల అపర్ణ వెంకట్, సత్యనారాయణ, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.