
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనివాసరావు
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన గోవిందు శ్రీనివాసరావును తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా తల్లాడలో ఆయనను శాలువాలు పూలమాలలతో సన్మానించి సత్కరించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో పాటు మున్నూరు కాపు సంఘంలో చురుగ్గా పాల్గొనే శ్రీనివాసరావుకు ఈ పదవి రావడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడాల లచ్చిరెడ్డి, మారెళ్ళ మల్లికార్జునరావు, మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, వడ్డే రామారావు, లక్ష్మీపురం మాజీ సర్పంచ్ ఓబుల సీతారామిరెడ్డి, నాయకులు బొడ్డు వెంకటేశ్వర రావు, బండి బాలసౌరి, గుజ్జర్లపూడి చింటూ, తాళ్ల వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.