తెలుగు గళం ఖమ్మం అహ్మదియ్య ముస్లిం జమాత్ యొక్క హ్యుమానిటీ ఫస్ట్ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలోని కాల్వ ఒడ్డు ప్రాంతంలో గల బొక్కలగడ్డ కాలనీలో ఇటీవల భారీ వర్షాల కారణంగా మున్నేరు వరద ముంపుకు గురై తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు ఉచిత ఆహార మరియు మంచి నీటి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఖమ్మం,నల్గొండ జిల్లాల అహ్మదియ్య సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం అందించారు.ఈ సందర్భంగా జిల్లా హ్యుమానిటీ ఫస్ట్ ఇన్చార్జి షేఖ్ మహబూబ్,జమాత్ జిల్లా అధ్యక్షులు షేఖ్ హుస్సేన్ జిల్లా ఇన్చార్జి ముహమ్మద్ అక్బర్ లు మాట్లాడుతూ.. నేడు ఈ శాఖ ఆధ్వర్యంలో జమాత్ ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని,కుల మతాల కతీతంగా మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపడుతుందని,ఇదే క్రమంలో ఖమ్మం పట్టణంలో వరద బాధితులకు రెండు జిల్లాల అహ్మదీయ ముస్లింలు తమ వంతు సామాజిక భాధ్యతతో ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా జమాత్ యూత్ అధ్యక్షుడు ముహమ్మద్ హుస్సేన్,ఖమ్మం పట్టణ అధ్యక్షుడు షేఖ్ ఖాసీం,షేఖ్ మౌలానా,షేఖ్ సయీద్,ముహమ్మద్ సదీద్ మరియు మొల్వీలు షేఖ్ ముస్తఫా,షేఖ్ బాబర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.