
మున్సిపల్ ఉద్యోగులకు ఉత్తమ సేవా అవార్డు
హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగుల కు ఉత్తమ సేవా అవార్డు లభించింది. పరకాల మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తున్న ఎం.ఈ.హెచ్ ఖురేషి, శానిటరీ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గంజి వెంకట్ రెడ్డి మరియు పరకాలకు చెందిన అంగన్ వాడి సెంటర్ లో పని చేస్తున్న టీచర్ పంచగిరి మాధవి ఉత్తమ అవార్డు అందుకున్నారు. మంగళవారం హనుమకొండ పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో చీప్ విఫ్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, సిపి ఎవి రంగనాథ్ చేతుల మీదుగా ఉత్తమ సేవా ఉద్యోగులుగా ప్రసంశా పత్రాలను అందుకున్నారు. ఈ అవార్డు లభించడం ద్వారా సామాజిక సేవా బాధ్యత పెంపొందించేలా చేసిందని వారు తెలిపారు.ఉత్తమ సేవా అవార్డు గ్రహీతలుగా ఎంపికైన ఇద్దరు ఉద్యోగులకు పరకాల మున్సిపాలిటీ సిబ్బందితో పాటు ఇతర శాఖల అధికారులు అభినందనలు తెలిపారు.