
ఈ69న్యూస్ హనుమకొండ జిల్లా:ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో జూలై 3వ తేదీ ఉదయం MRPS మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటుతో పాటు జెండా గద్దె నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో మండల ఇంచార్జి గంగారపు శ్రీనివాస్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.జూలై 7న జరగనున్న MRPS 31వ వార్షికోత్సవ వేడుకలకు పల్లెలు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో MRPS మండల అధ్యక్షుడు సోంపెల్లి అన్వేష్,ఉపాధ్యక్షుడు కందుకూరి ప్రభాకర్,కార్యదర్శి చిట్యాల భరత్,ఇతర గ్రామ నాయకులు పాల్గొన్నారు.