
ఈ69న్యూస్ హన్మకొండ/స్టాఫ్ రిపోర్టర్ గొల్లపల్లి అనిల్ రాజ్
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ఫారెస్ట్ భూముల విషయంలో భూభాధిత రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ మాట్లాడుతూ,గత ఎన్నో సంవత్సరాలుగా ఆ భూముల్లో రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని,కానీ ఫారెస్ట్ అధికారులు అప్రయోజకంగా ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.కొద్ది రోజుల క్రితం కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన సంయుక్త సర్వేలో రైతుల భూములకు,ఫారెస్ట్ భూములకు రేఖలు గీకి సరిహద్దుల్లో రాళ్లు కూడా పాతారని,ఇది సమస్య పరిష్కారానికి తొలి అడుగని తెలిపారు.గెజిట్ నోటిఫికేషన్లో లేని భూములు తొందరలో పరిష్కారమవుతాయని, గెజిట్లో ఉన్న భూముల విషయంలో తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ సమస్య పై పలు మార్లు మాజీ ఎమ్మెల్యే రాజయ్య అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి కలిసినా స్పందించలేదని,అదే కడియం శ్రీహరి ఎమ్మెల్యే అవగానే రైతులు సమస్య గురించి చెప్పగానే స్పందించి పట్టించుకొని సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్న క్రమంలో మద్దతుగా ఉండాల్సిన రాజయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.శ్రీహరి రైతులకు న్యాయం చేసేందుకు చొరవ చూపుతుంటే అది రాజయ్య ఓర్వలేక పోతున్నాడని అన్నారు.