
ముస్లిం ఆర్గనైజేషన్ జేఏసీ జిల్లా కన్వీనర్ గా రెహమాన్
తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్ ( జే ఏ సి) జాయింట్ యాక్షన్ కమిటీ ఖమ్మం జిల్లా కన్వీనర్ గా అబ్దుల్ రెహమాన్ ను నియమించారు. ఈమేరకు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ సలీం పాషా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా పురస్కరించుకొని అబ్దుల్ రెహమాన్ ను వివిధ కుల, ప్రజా సంఘాలు, ఐక్యవేదిక నాయకులు అభినందిస్తూ… బొ కే తో పాటు శాలువా కప్పి,సత్కరించారు. అనంతరం అబ్దుల్ రెహ్మాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా నేడు ముస్లిం మైనార్టీలు వేదన ఏమిటో అందరికీ తెలిసిందేనన్నారు. కేంద్రంలోని అధికార పార్టీ కుతంత్రాల మేరకే దేశవ్యాప్తంగా మతకలహాలు యదేచ్చగా జరుగుతున్నాయి అన్నారు. వామ పక్షాల తో పాటు ప్రజాస్వామికవాదులు బలహీనత పడటం వల్లనే ఇలాంటి ఉదాహరణలు జరుగుతున్నాయని విమర్శించారు. జరిగిన.. జరుగుతున్న దారుణాల వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఆ పార్టీ వెనుక అధికార యంత్రాంగం ఉందని, మనదైన వసుదైక కుటుంబ భావన , భిన్నత్వంలో ఏకత్వం మన దేశం ఒక ప్రతీక అని.. మన మూలాల సైదాంతికత ఇదేనన్నారు. భారత దేశంలో ముస్లిం మైనార్టీల స్థితిగతుల గురించి అనేక కమిషన్లు చెప్పిన దానిని అనుసరించి ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దగాబడ్డ ముస్లింల కోరకు తెలంగాణ రాష్ట్ర ముస్లిం డిక్లరేషన్ 22 ప్రతిపాదనలతో త్వరలో జరగబోయే ఎన్నికలలో , ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలలో ఈ విషయం పొందుపరచాలని కోరారు.మీద విశ్వాసముంచి తనను జిల్లా కన్వీనర్ గా నియమించడం పట్ల అబ్దుల్ రెహ్మాన్ ,, రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ సలీం పాషాకు ,రాష్ట్ర కో కన్వీనర్ స్కైబాబాకు, చీఫ్ అడ్వైజర్ ప్రొఫెసర్ షేక్ వలి హుస్సేన్ , కోఆర్డినేటర్ సయ్యద్ యూనిస్ పర్వేజ్, రాష్ట్ర జేఏసీ కార్యవర్గ సభ్యుడు, ఖమ్మం ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ హమ్మద్ జమీల్ లకు కృతజ్ఞతలు ప్రకటించారు. ముస్లింల సాధికారత సాధించేవరకు తాను విశ్రమించనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ముస్లిం మైనార్టీల హక్కుల సాధనకు, 12% శాతం రిజర్వేషన్ల కోసం ఉద్య మిస్తనన్నారు. అబ్దుల్ రెహమాన్ ను సత్కరించి , అభినందించిన వారిలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బా నో తు బ దృ నాయక్, బామ్ సేఫ్ రాష్ట్ర కార్యాలయ ఇంచార్జ్ జె. శ్రీనివాస్ , వివిధ కుల , ప్రజాసంఘాల , ఐక్యవేదిక నాయకులు జంగిపల్లి రవి, ఉపేంద్ర బాయి, జంపా నాయక్ , కొటేష్ నాయక్, మదన్ నాయక్, ముని వీరన్న ,మట్టి ప్రసాద్ ,జి నరేందర్ రావులపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.