జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం దేషాయి తండలో తండవాసి అయిన భూక్య తిరుపతి మరణించగా ఆ కుటుంబాన్ని ఓదార్చి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని జై హనుమాన్ రైతు సంఘం సభ్యులు ధైర్యాన్ని ఇచ్చారు.జై హనుమాన్ రైతు సంఘం తరఫున 5000 రూపాయలు తిరుపతి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా జై హనుమాన్ రైతు సంఘ అధ్యక్షుడు మరియు రాజరాజేశ్వరి మెడికల్ షాప్ ప్రొప్రైటర్ భూక్య రాజు మాట్లాడుతూ..తిరుపతి నా ప్రాణ మిత్రుడిని కోల్పోవడం నన్ను ఎంతగానో కలిసి వేసిందని తను లేని లోటు ఆ కుటుంబానికి మరియు నాకు తీరనిది అని నా ప్రాణమిత్రుడి కుటుంబానికి నా యొక్క అండదండలు ఉంటాయి అని అన్నారు.వారితో పాటు సంఘ సభ్యులు బీకు,రాజు,యాదగిరి,సుందర్,లచ్చ,కాలు,కిస్టు తదితరులు పాల్గొన్నారు.