
మృతుని కుటుంబానికి రూ.1,500 సహాయం అందజేత
ఈ69న్యూస్ హన్మకొండ/స్టాఫ్ రిపోర్టర్ గొల్లపల్లి అనిల్ రాజ్
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామానికి చెందిన ముప్పిడి శ్రీనివాస్ రెడ్డి (47) ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర పురుషుల పొదుపు సంఘం సభ్యుడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి,దహన సంస్కారాలకు నిమిత్తం సంఘం తరఫున రూ.1,500 ఆర్థిక సహాయం అందజేయబడింది.అంతేకాక,ఆయన ఇన్సూరెన్స్ కింద రూ.2,80,000 కూడా ఆయన కుటుంబానికి అందించనున్నారు.ఈ కార్యక్రమంలోసంఘం అధ్యక్షుడు కాశిరెడ్డి తిరుపతిరెడ్డి, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.