
మెగా రక్తదాన శిబిరం
కోదాడ పట్టణంలో ఈనెల 27న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ జన్మదిన వేడుకలను కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎలక్ట్రానిక్ మీడియా నియోజకవర్గం అధ్యక్షులు పడిశాల రఘు తెలిపారు.అంజన్ గౌడ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈనెల 27వ తేదీన ఆదివారం కోదాడ పట్టణంలోని బాలురు ఉన్నత పాఠశాలలో తలసేమియా బాధపడుతున్న వ్యాధిగ్రస్తుల పిల్లలకు మెగా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు.కాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ను టీ డబ్ల్యూ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి హరి కిషన్ నియోజకవర్గ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాసరావు లు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.కాగా జర్నలిస్టుల సామాజిక సేవలు అభినందించిన ఎమ్మెల్యే తప్పకుండా హాజరు అవుతానని తెలిపారు. రక్తదానం చేసే దాతలు ఎవరైనా ఉన్నట్లయితే 9701415412, 99857 36962 నెంబర్ లకు సంప్రదించాలని రఘు కోరారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు
సోమపంగు గణేష్, మరికంటి లక్ష్మణ్, పిడమర్తి గాంధీ, మాతంగి సురేష్, కుడుముల సైదులు, చెరుకుపల్లి శ్రీకాంత్, గంధం వెంకటనారాయణ, చింతలపాటి సురేష్, తంగలపల్లి లక్ష్మణ్, నజీర్, చీమ శేఖర్, భద్రం ,వెంకన్న, శ్రీహరి, నరేష్, శ్రీను, రహీం, హరీష్, సైదులు, అంజి,తదితరులు పాల్గొన్నారు.