మెప్మా ఆర్పీలకు కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలి
Jangaonసిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు
సిఐటియులో చేరిన ఆర్పీలు~~
జనగామ: మెప్మా ఆర్పి లకు కనీస వేతనం నెలకి 26,000 ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో
సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొట్ల శ్రీనివాస్ రాపర్తి రాజు, జోగు ప్రకాష్ సమక్షంలో మెప్మా ఆర్పీలు సిఐటియులో లో చేరారు వారికి సిఐటియు కండువాలు కప్పి నాయకులు ఆహ్వానించారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్పీల సమావేశానికి మెప్మా ఆర్పీల యూనియన్ అధ్యక్షురాలు బోట్ల ప్రశాంతి అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ మున్సిపల్ పట్టణాలలో ప్రజలకు సేవలు అందించుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకందెల కృషి చేసే ఆర్పీలు మాత్రం చాలీచాలని నెలకు 4 వేల వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు తక్కువ వేతనాలతో కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఏళ్ల తరబడి మెప్మా ఆర్పి ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు మరోవైపు మెప్మా ఆర్పీలపై పని భారం మోపుతూ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు పండుగలు శుభకార్యాలు అనారోగ్యం గురైన సందర్భంగా సైతం సెలవులు ఇవ్వకపోవడంతో మానసిక ఒత్తిడికి గురై ఇబ్బంది పడుతున్నారని వారాంతపు సెలవులు పండుగ సెలవులు ఇవ్వాలన్నారు ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వాలన్నారు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు డిమాండ్ చేశారు ఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు ప్రభుత్వం స్పందించకపోతే ఆర్పీల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేపడతామని తెలిపారు ఈ సమావేశంలో CITUలో చేరిన వారిలో మెప్మా ఆర్పీల యూనియన్ నాయకులు ఏ వాసవి డి రేవతి బి వసంత ఎం రాజలక్ష్మి డి జ్యోతి కె శాంత ఏం సమత ఎం నర్మద సమీనాబేగం డి సుమలత s సంధ్య కే సరిత ఆర్ శ్రీమతి కె పుష్ప ఎం బాలఇన్నర బి రేణుకమంజుల జి రేణుక ఉన్నారు