
-జగనన్న పట్ల మమకారం ప్రజల కోసం ఉద్యమంగా మారిన ప్రవాసాంధ్రుల చైతన్యం
ఈ69 న్యూస్, శింగనమల.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగ గ్లోబల్ కోఆర్డినేటర్ శ్రీ ఆలూరు సాంబశివారెడ్డి చేపట్టిన వైఎస్సార్సీపీ గ్లోబల్ కనెక్ట్ పర్యటన మే 3న మెల్బర్న్లో ఘనంగా కొనసాగింది.మల్టికల్చరల్ ఆస్ట్రేలియా నగరమైన మెల్బర్న్లో ప్రవాసాంధ్రులు, వైఎస్సార్సీపీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా సాంబశివారెడ్డి మాట్లాడుతూ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఓ రాజకీయ నాయకుడిని మించిన స్టేట్స్మా న్ అని అభివృద్ధికి మార్గం చూపుతూ సంక్షేమాన్ని సుస్థిరంగా నిర్మించే నేతని తన మేనిఫెస్టోను ప్రజలతో ఓ నైతిక ఒప్పందంగా భావించి, దాన్ని ఒక వేదం లా పాటించి పాలించారన్నారు.99% హామీలు అమలు చేసిన ఘనత దేశంలో ఏ ప్రభుత్వానికి కూడా లేనిదని అధికారం కోసం కాదు, బాధ్యత కోసం పని చేసిన నాయకుడు వైయస్ జగన్ అని అన్నారు.పాలనలో పునాది నుంచి విప్లవం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 2019–2024 మధ్య జరిగిన విప్లవాత్మక మార్పులను ఈ సందర్భంగా నిశితంగా వివరించారు.
• పాలనా విప్లవం-15,004 సచివాలయాలు, 2.6 లక్షల వాలంటీర్లు, స్పందన
• ఆరోగ్య విప్లవం-17 మెడికల్ కాలేజీలు, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ విస్తరణ
• విద్యా రంగం- అమ్మఒడి, నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, ట్యాబ్‌లు, విద్యా దీవెన, వసతి దీవెన
• సంక్షేమం-₹4.47 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి (13 కోట్ల లావాదేవీలు)
• ఆర్థికాభివృద్ధి-₹13 లక్షల కోట్ల పెట్టుబడులు అమలు దశలో ఉన్న మెగా ప్రాజెక్టులు
• ఇన్ఫ్రాస్ట్రక్చర్,పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రహదారులు, గృహ నిర్మాణాలు, వ్యవసాయ గోదాములు.ఇక సోషల్ మీడియా ప్రత్యక్ష రాజకీయ వేదికల కంటే సామాజిక మాధ్యమాల్లో నిజాల గళం ప్రాధాన్యం పెరుగుతోందని వివరించిన సాంబశివారెడ్డి అబద్ధాలకు గళం ఇస్తే, మనం వాస్తవాలకు శబ్దం ఇవ్వాలని డేటా, గణాంకాలు, గ్రాఫులు ఇవే మన ఆయుధాలని ఈ పోరాటంలో ప్రవాసాంధ్రులు ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు. జగనన్న హయాంలో జరిగిన విప్లవాత్మక మార్పులు ప్రపంచానికి తెలియజేయాలని అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మెల్బర్న్ టీమ్‌కు ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు.మెల్బర్న్ టీమ్ కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ సమావేశం విజయవంతంగా జరిగిందని,ఈ ఆత్మీయత, సమిష్టి శక్తి ప్రపంచ వ్యాప్తంగా వైఎస్సార్సీపీను మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్ఆర్సీపీ కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి, మెల్బోర్న్ కన్వీనర్ కృష్ణా రెడ్డి మరియు పార్టీ మద్దతుదారులు పాల్గొన్నారు.