
మెస్ కస్మాటిక్ ఛార్జీలు పెంచాలి
ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని గురుకులాల్లో పేరుకుపోయిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆర్ సి ఓ డిఎస్ .వెంకన్న సార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా అజ్మీర వెంకట్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని హాస్టల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అన్ని గురుకులాలకు రాష్ట్ర ప్రభుత్వం సొంత భవనాలు నిర్మాణం చేయాలని విద్యార్థులకు అనుగుణంగా లెటర్స్ బాత్రూమ్స్ తరగతి గదులు నిర్మించాలని సకాలంలో నోట్ బుక్స్ పాఠ్య పుస్తకాలు అందించాలని వారు డిమాండ్ చేశారు అంతేకాదు వర్షాకాలంలో సీజన్ వ్యాధుల వల్ల పిల్లలకు విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉంటుంది కావున దోమతెరలు అందించాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అన్ని గురుకులాలలో ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాలని మెనూ చార్ట్ ప్రకారం పిల్లలకు పోషకమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో బానోతు మోహన్ అజ్మీర రవి గుగులోతు మోతిలాల్ పాల్గొన్నారు