
telugu galam news e69news local news daily news today news
మేడారం ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన అర్రేమ్ లచ్చు పటేల్ మరియు ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేసిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు బట్ట మురళీకృష్ణ
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా రాష్ట్ర ప్రభుత్వం తాడ్వాయి మండలంలోని కొండపర్తి గ్రామానికి చెందిన అర్రెమ్ లచ్చు పటేల్ ని నియమించారు. ఈ గిరిజన మహా జాతరకు అనుభవం కలిగిన వ్యక్తిని అధ్యక్షులుగా నియ మించడం చాలా సంతోషంగా ఉందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు బట్ట మురళీకృష్ణ అన్నారు. కుంభమేళగా పిలవబడుతున్న ఈ మేడారం మహా జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి గిరిజనులు గిరిజ నేతరులే కాకుండా అన్ని కులాలవారు కోటి మందికి పైగా భక్తులు మేడారం జాతరకు వచ్చి వలదేవతలైన సమ్మక్క సారాలమ్మలను పసుపు కుంకుమలతో చీరసారలతో నిలువెత్తు బంగారం(బెల్లం)తో సమర్పించి దర్శించుకుంటారని కోటి మందికి పైగా వచ్చే భక్తులకు భక్తుల సౌకర్యార్థం మేడారంలో అన్ని వసతులు కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు మంచర్ల నాగేశ్వరరావు, బిసి సీనియర్ నాయకులు నీలం రాజేష్, భక్తులు బుజ్జిబాబు, శ్రీనన్న, తదితరులు పాల్గొన్నారు