
telugu galam news e69news local news daily news today news
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని బి.ఆర్.ఎస్ ములుగు జిల్లా గౌరవ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు స్వగృహంలో వారి చేతుల మీదుగా శ్రీ మేడారం సమ్మక్క,సారక్క జాతర సాంగ్ ఆడియో లాంచ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ రచయిత, గాయకురాలైనా మంగపేట మండలం నిమ్మగూడెం గ్రామ వాస్తవ్యురాలు, నిరుపేద కుటుంబానికి చెందిన మద్దెల సమ్మక్కలో ఒక గాయని దాగి వున్నదని గుర్తించి ఈ సమాజానికి కళాకారులు ఎంతో అవసరమని వారిలో దాగివున్న ప్రతిభ ప్రపంచానికి తెలియజేసే విధంగా ముందుండి ఈ ఆడియో లాంచ్ కి ఆర్థికంగా సహాయ, సహకారాలు అందించిన కాకులమర్రి లక్ష్మణ్ బాబు ఈ ఆడియో లాంచ్ చేసి ఆమెకు, ఇలాంటి కళాకారులకు సహాయ, సహకారాలు అందిస్తామని ఆమె టాలెంటుకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా మా నుండి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు ఎం.పీ.పీ అంతటి విజయ, శివాలయం చైర్మన్ తాండూరి రఘు, ఎంపీటీసీ కుమ్మరి చంద్రబాబు, కాకులమర్రి ప్రదీప్ రావు, మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ రామ్ నరసయ్య, మాజీ మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ దడిగెల సమ్మయ్య, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి, పార్టీ నాయకులు తాటి కృష్ణ, భాస శేషు, కమలాపురం సోషల్ మీడియా ఇంచార్జ్ బీస్ సాంబయ్య, భాస పుల్లయ్య, కొమరం పుల్లారావు, మద్దెల.రాజేంద్రప్రసాద్, జై భీమ్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.