వరంగల్ జిల్లా రంగశాపేట,సంగెం మండలాల్లో మేడే సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సాగర్ పాల్గొని ప్రసంగించారు.పోరాటాలతో సాధించిన కార్మిక హక్కులు మోడీ పాలనలో ప్రమాదంలో ఉన్నాయని,లేబర్ కోడ్స్ రూపంలో కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించనుందని అన్నారు.మే 20న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులను కోరారు.ఈ కార్యక్రమంలో రవికుమార్,సాయిలు,రఘుపతి,స్వప్న తదితరులు పాల్గొన్నారు.