
ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం నుండి ప్రతి ఇంటి నుండి చిటికెడు మట్టిని సేకరించి దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించబోయే అజాదీ కా అమృత్ మహోత్సవ్ స్థూపం కోరకు ఉపయోగించనుండగా
జాఫర్ ఘడ్ మండల కేంద్రంలో మరియు స్టేషన్ ఘనపూర్ మండల పరిధిలోని శివుని పల్లి గ్రామం లో బీజేపి ఆధ్వర్యంలో మేరీ మట్టి మేరా దేశ్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య తనయుడు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ పాల్గొని ప్రారంభించి ఇంటి ఇంటికి వెళ్ళి మట్టిని సేకరించి ప్రతి ఒక్క పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ ఇనుగాల యుగంధర్ రెడ్డి,అసెంబ్లీ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి, మేరీ మాటీ మేరా దేశ్ కార్యక్రమాల అసెంబ్లీ కన్వీనర్ కావేటి ముత్యాలు యాదవ్,జఫర్గడ్ మండల అధ్యక్షుడు తౌటి సురేష్ గౌడ్,జిల్లా కార్యవర్గ సభ్యులు బుర్ర తిరుపతి గౌడ్,దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రడపాక ప్రదీప్ స్టేషన్ ఘనపూర్ మండల ప్రధాన కార్యదర్శి భాస్కుల ఆరోగ్యం,దళిత మోర్చా మండలాధ్యక్షుడు ఇల్లందుల సారయ్య,కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు రవి,మన్ కి బాత్ మండల కన్వీనర్ సంతోష్ రెడ్డి,శక్తి కేంద్ర ఇన్చార్జ్ మేకల పవన్ యాదవ్,బుర్ల విష్ణుమూర్తి, అసెంబ్లీ సోషల్ మీడియా కో కన్వీనర్ తౌటి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.