
డిజిటల్ మీడియా జర్నలిస్ట్‌లతో ‘మీట్ ద ప్రెస్’’
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను తీసుకవచ్చి, అమలుకు పూనుకోబోతున్నది. లేబర్ కోడ్లు అమలు జరిగితే భ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు వచ్చి, కార్మికులు బానిసలు మారనున్నారు. ఈలాంటి దుర్మార్గమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2025 మార్చి 18న న్యూ ఢల్లీిలో జరిగిన నేషనల్ వర్కర్స్ కన్వెన్షన్ 2025 మే 20న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెను మన రాష్ట్రంలోని ఉద్యోగులు, కార్మికులు జయప్రదం చేయాలని, లేబర్ కోడ్ల వల్ల జరిగే నష్టానాలను కార్మికులకు, ప్రజలకు చేరవేయాలని అందుకు రాష్ట్ర వ్యాప్తంగా డిటిజిల్ మీడియా జర్నలిస్టు సహాయ, సహాకారాలు అందించాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ రోజు టియు న్యూస్, ఇ69 న్యూస్ ఆధ్వర్యంలో డిజిటల్ మీడియా జర్నలిస్టులతో మీట్ ద ప్రెస్ కార్యాక్రమం, సుందరయ్య విజ్ఞా కేంద్రంలో టియు న్యూస్ బాధ్యులు యాటల సోమన్న అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షలు చుక్క రాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, వి.ఎస్.రావులు పాల్గొన్నారు.
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతూ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం తన కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తున్నది. కార్మికవర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలలో సాధించుకొన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ముందుకు తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్ళుగా కార్మికవర్గం ఆందోళనా, పోరాటాలతో లేబర్ కోడ్ల అమలును గత 5 సం॥లుగా నివారించగలుగుతున్నాం. నేడు వాటిని అమలు చేసి కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తున్నదన్నారు. హిందుత్వ ఎజెండా ముందుకు సాగుతూ రాజ్యంగ విలువలను, రాజ్యంగం కార్మికులకు కల్పించిన ప్రాథమిక హక్కులను అరిస్తుందన్నారు. లేబర్ మార్కెట్ కోసం పెట్టుబడిదారులు ప్రభుత్వం నుండి భూములు, నిధులు, ఇతర అనేక రాయితీలు పొందున్నప్పటీకి వారి మరింత లాభాల అర్జించడం కోసం అడ్డుగా ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేయాలని పట్టుబట్టడంతో మోడీ ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తీసుకవచ్చి కార్మికుటను కట్ట బానిసలుగా మారుస్తుందన్నారు. రద్దు చేసిన కార్మిక చట్టాలలో వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలను కూడా రద్దు చేయడంతో జర్నలిస్ట్‌లకు అనేక సౌకర్యాలు, హక్కులు కోల్పొతున్నరని, అందుకు జర్నలిస్టులు, డిజిటల్ జర్నలిస్టులందరూ మే 20 జరిగే సమ్మెలో భాగస్వాములు కావాలని, ప్రజలను, కార్మికులను చైతన్య పర్చాలని వారు కోరారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ . భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన 78 సం॥ల తర్వాత కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు నేడు ముప్పు వాటిల్లింది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లను అమలులోకి తెస్తున్నారు. 12 గంటల పనిని చట్టబద్దం చేస్తున్నారు. సామాజిక భద్రతా పథకాలకు నిధులు తగ్గిస్తున్నది. కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్‌ను కఠినతరం చేసి, కార్మిక సంఘాలను రద్దు చేసేందుకు కూడా బరితెగించింది. ఉమ్మడి బేరసారాల హక్కులను తొలగించి, వాటిని బిఎన్ఎస్ చట్టం ద్వారా నాన్‌బెయిలబుల్ కేసులుగా మార్చింది. పని ప్రదేశాలలో, గేటు మీటింగ్‌లు, కరపత్రాల పంపిణీ వంటి వాటిని సైతం నిషేధించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులనన్నింటినీ తుంగలోకి తొక్కుతున్నారు. చట్టాలు అమలు చేయని యాజమాన్యాలకు శిక్షలు తగ్గించడం, కార్మిక శాఖను పూర్తిగా ఫెసిలిటేట్ (మధ్యవర్తిత్వం) విభాగంగా మార్చడం, స్కీమ్ వర్కర్స్‌ను కార్మికులుగా గుర్తించకుండా వెట్టి చాకిరి చేసే విధంగా లేబర్ కోడ్లు రూపొందించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికుల సమ్మె హక్కును నిర్వీర్యం చేస్తూ, సమ్మె చేయలేని పరిస్థితులను ఈ కోడ్ల ద్వారా కల్పించి, కార్మికులను తిరిగి బానిసత్వంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు.. అందుకే 4 లేబర్ కోడ్లను తిప్పికొట్టి, కార్మిక చట్టాలను కాపాడుకోవడం కార్మికవర్గానికి చాలా అవసరమని, ఇందుకు మీడియా మిత్రులు సహాకరించాలని కోరారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య మాట్లాడుతూ మల్టినేషనల్ కంపెనీలలో హైలీ స్కీల్డ్ కార్మికులకు రిక్రూట్ చేసుకోని ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పెరుతో మధ్యలోనే ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ సంఘాలను, ఆసోసియేషన్లను ఏర్పాటు చేసుకోని వారి హక్కుల కోసం పోరాడుతున్నారు. నేడు ఆర్ట్ఫిషియల్ ఇంటలిజెన్సీ వచ్చాక కొత్త ప్రమాధం రానున్నదని, ఈ ఏఐ కూడా కార్పోరేట్ కంపెనీల చేతుల్లోనే ఉంటది, వారి లాభాల కోసం ఎఐని వాడుకోని కార్మికులపై దాడులు చేయబోతున్నారు. దీందో పోరాడే శక్తి సన్నగిళ్ళుతుంది. బేరసారాలాడే హక్కులు కోల్పోతారు. కాబట్టి అసంఘటిత రంగ కార్మికుల నుండి మొదలుకొని ఐటి ఉద్యోగుల అందరూ మే 20 సమ్మెలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.