
మే 20న జరగనున్న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పోస్టర్ ఆవిష్కరించారు.
వరంగల్ ఎంజీఎం సెంటర్లో ఆటో కార్మికులు మే 20న జరగనున్న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు మద్దతుగా పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నేతలు ముక్కల రామస్వామి,ఎం.సాగర్,మహబూబ్ పాషా తదితరులు రవాణా రంగాన్ని కార్పొరేట్లకు అప్పగించొద్దని,ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు,రూ.4,500 పెన్షన్,రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు.ఇతర నేతలు హంజద్,దస్తగీర్,ఇమ్రాన్,వహీద్,హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.