మైనారిటీలకు ఆర్థిక సహాయం 5 లక్షలకు పెంచాలి
Hyderabad
కొత్త అప్లికేషన్స్ అవకాశం కల్పించాలి
శాంతియుతంగా ధర్నా చేస్తున్న వాళ్ళను అక్రమం అరెస్టు చేయడం దుర్మార్గం.
ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్
మైనారిటీలకు ఆర్థిక సహాయం 5లక్షలకు పెంచాలని, కొత్త అప్లికేషన్స్ కు అవకాశం కల్పించాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు.శాంతియుతంగా ధర్నా చేస్తున్న వాళ్ళను అక్రమం అరెస్టు చేయడం దుర్మార్గం అని ఆయన అన్నారు. ఆవాజ్ హైదరాబాద్ సౌత్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ హౌజ్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా పేద మైనారిటీలకు కేవలం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడం మైనారిటీల పట్ల ప్రభుత్వ వివక్షకు నిదర్శనం, ఆర్థిక సహాయం 5 లక్షలకు పెంచాలని. కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెంచకుండా ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడం మైనారిటీలను మోసం చేయడమే. 2 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకుంటే, మండలానికి నాలుగైదు మందికి మాత్రమే శాంక్షన్ చేశారు. గతంలో కేసిఆర్ మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, బడ్జెట్ మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం అని వాగ్దానం చేసి 9 సంవత్సరాలుగా నెరవేర్చడం లేదు. మైనారిటీ సంక్షేమానికి 1700కోట్లు కేటాయించి నేటికీ 5వందల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మైనారిటీల సంక్షేమాన్ని, అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులు, చిరువ్యాపారులకు, పేదలకు 5లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిని ప్రభుత్వం దౌర్జన్యంగా అరెస్టు చేసి, నిరసన తెలిపే గొంతుకలను అణచివేయడమేనని అన్నారు. ఆవాజ్ హైదరాబాద్ సౌత్ సిటీ కార్యదర్శి షేక్ అబ్దుల్ సత్తార్, ఆవాజ్ రాష్ట్ర నాయకులు బాబర్ ఖాన్, కలీముద్దీన్, జిల్లా నాయకులు అక్తర్ బీ, అన్వర్, మహమ్మద్ ఆలీ, అర్షద్, ఫయీమ్, లాయఖ్ అలీ, యాకూబ్, షౌకత్ తదితరులను అరెస్టు చేశారు. ధర్నాలో వివిధ ఏరియాల నుండి మైనారిటీలు పాల్గొన్నారు.