ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ సంక్షేమ బడ్జెట్ 3వేల కోట్లకు పెంచాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. ఆవాజ్ మేడ్చల్ జిల్లా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి తీవ్రమైన అన్యాయం చేసిందని, గత బడ్జెట్ లో 5020 కోట్లు కేటాయించి 2600 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ బడ్జెట్లో మొత్తం కేటాయింపులు సగానికి తగ్గించింది. 45 లక్షల కోట్ల బడ్జెట్లో మైనారిటీ 3079 కోట్ల కేటాయించడం దారుణం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్లో 1702 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఈ బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు.సమావేశానికి మేడ్చల్ జిల్లా నాయకులు బుర్హాన్ అధ్యక్షత వహించారు. ఎండి సలీమ్, ఇమ్రాన్, అక్బర్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.