ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *మహమ్మద్ అబ్బాస్* డిమాండ్మైనారిటీ యువతకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇవ్వాలని కోరుతూ ఆవాజ్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా, సౌత్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫీసు (హజ్ హౌజ్) ముందు ధర్నా చేపట్టారు. ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ గత 5సంవత్సరాలుగా ఒక్క లోన్ కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ సంవత్సరం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కు 50కోట్లు కేటాయించి లోన్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి 4నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క లోన్ అప్లికేషన్ తీసుకోలేదని విమర్శించారు. మైనారిటీ బంద్ పథకం ప్రకటించి పేద మైనారిటీ యువతకు, చిరు వ్యాపారులు చేసుకునేవారికి 5లక్షల ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అజీజ్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ అలీ, హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి షేక్ అబ్దుల్ సత్తార్, నాయకులు ఇబ్రహీం, నజీర్ అహ్మద్, ఖాజా గరీబ్ తదితరులు పాల్గొన్నారు.